
విజయనగరం రూరల్:, 13 జూలై (హి.స.)
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్) కార్యక్రమాన్ని నిర్దేశి రామ్ సుందర్ గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాజాం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఇంటింటి సర్వే, డిజిటైజేషన్, దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి అర్హుడి వివరాలు తప్పకుండా నమోదు చేయాలని, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 94 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్నందున మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత గడువులో లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ