
నారాయణఖేడ్, 13 జూలై (హి.స.)సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఈరోజు(సోమవారం) నారాయణఖేడ్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, SIR పై అవగాహన సదస్సుకు మాజీ మంత్రి హాజరై మాట్లాడారు. షాబాద్లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని ఆరోపించారు. రాజకీయాల కోసం పోలీసులను వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు చిన్న పోస్టు పెడితే సాయంత్రానికి అరెస్ట్ చేస్తున్నారని.. సైకోను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్యలు జరిగేవి కాదు కదా అని ప్రశ్నించారు.
రేవంత్ హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి అన్నారు. షాబాద్ కిల్లర్ను రేవంత్ సన్నిహితుడే పోక్సో కేసు నుంచి కాపాడారని ఆరోపించారు. రేవంత్ సన్నిహితుడు పోలీసులకు రూ.20 లక్షల లంచం ఇచ్చి రాజ్కుమార్ను కాపాడారన్నారు. పోలీసులు రేపిస్ట్తో కలిసి మద్యం తాగారని మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు ఆలస్యం చేస్తే బెయిల్పై వచ్చి హత్యలు చేశాడని ఫైర్ అయ్యారు. పోలీసులను ల్యాండ్ సెటిల్మెంట్లకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్