
సిద్దిపేట, 13 జూలై (హి.స.)
1 నుండి 19 సంవత్సరాలలోపు
పిల్లలందరికీ తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కొండపాక మండలం దుద్దేడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం'లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు, ఆటల్లో రాణించగలరని చెప్పారు. విద్యార్థులు భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం వంటి పరిశుభ్రత అలవాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు