తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో TG-TET (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2026 ఫలితాలను ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం విడుదల చేశారు.
Telangana TET


హైదరాబాద్, 13 జూలై (హి.స.)తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలను (TG TET Results 2026) ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in లో చూసుకోవచ్చని టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన టీజీ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల్లో అభ్యర్థుల మార్కులు, అర్హత తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande