రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన
రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు రాష్ట్ర మంత్రులుశంకుస్థాపన
Minister


మహబూబ్నగర్, 13 జూలై (హి.స.)

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రూ. 1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ఫేజ్-1 కింద మొత్తం నాలుగు ప్యాకేజీల పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్లో రూ. 573 కోట్లతో చేపట్టనున్న 'మహబూబ్నగర్-1' ప్యాకేజీ పనులకు ఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శానససభ్యులు వాకిటి శ్రీహరిలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande