
పాలకొల్లు,, 13 జూలై (హి.స.)
: గోదావరికి పుష్కరాలు వస్తున్నాయంటే ముందుగా ముస్తాబు కావాల్సింది దేవాలయాలు. పుష్కరాల వేళ ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాలను సిద్ధం చేయడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిధులు మంజూరు చేసింది. వాటిలో జిల్లాకు రూ.14 కోట్లు మంజూరయ్యాయి. వాసవీ పెనుగొండ మండలం సిద్ధాంతం మొదలుకుని 60 కి.మీ. మేర నదీ తీరాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. జిల్లాతోపాటు పుష్కరాల వేళ ఇతర ప్రాంతాల భక్తులు పుణ్య స్నానాలకు తరలివస్తారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ దేవాలయాలన్నీ సిద్ధమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ