ఆలమట్టిలోకి ఒక్కరోజే 12 టీఎంసీలు చేరిక.. నేటి నుంచి తగ్గనున్న ఇన్ఫ్లో
ఆలమట్టిలోకి ఒక్కరోజే 12 టీఎంసీలు చేరిక.. నేటి నుంచి తగ్గనున్న ఇన్ఫ్లో
ఆలమట్టి


విజయపుర్, 13 జూలై (హి.స.) : కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 12 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం1,31,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 483 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయం నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 86.061 టీఎంసీలు ఉంది. మహారాష్ట్రలో వరా ్షలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో వరద తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆలమట్టికి వచ్చే ప్రవాహం కూడా వచ్చే నాలుగు రోజుల్లో బాగా తగ్గుతుందని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నాటికి 64,700 క్యూసెక్కులకు తగ్గుతుందని.. క్రమంగా 17వ తేదీకి 8,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉంటుందని అంటున్నాయి. కాగా, తుంగభద్ర జలాశయానికి కూడా వరద తగ్గుతోంది. శనివారం 38,9 77 క్యూసెక్కులుగా నమోదైన ఇన్ఫ్లో.. ఆదివారానికి 25,120 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 22.948 టీఎంసీల నిల్వ ఉంది. ఆలమట్టి దిగువన నారాయణపూర్, జూరాలకు ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం డ్యాంలోకి చుక్క నీరైనా రావడం లేదు. నాగార్జునసాగర్ పరిస్థితి కూడా ఇంతే. ప్రస్తుతం సాగర్లో 138.03 టీఎంసీల నీరుంది. పులిచింతలలో ఆదివారం 30.99 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande