పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు
chandra babu


పోలవరం, 13 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హెలికాప్టర్‌లో ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహాన్ని, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య జరుగుతున్న పనులను ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

అనంతరం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్)లోని గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు, నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande