పవన్కు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇప్పుడే జనాల్లోకి రాకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పాను: సీఎం చంద్రబాబు
పవన్కు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇప్పుడే జనాల్లోకి రాకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పాను: సీఎం చంద్రబాబు
chandra babu


కొత్తపేట , 13 జూలై (హి.స.)

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అభిమానులు చాలా ఎక్కువని, ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతానికి జనంలోకి రాకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పిచ్చుకలంక గ్రామంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్‌కు భుజం నొప్పితో ఆపరేషన్ జరిగింది. ఆయన్ను పరామర్శించడానికి నేను ముంబై వెళ్లాను. ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. అయినా ప్రజల్లోకి వస్తానని డిప్యూటీ సీఎం అంటున్నారు. అభిమానుల తాకిడి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత బాగా సేవ చేయగలరు. అందుకే పూర్తి ఆరోగ్యవంతుడయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని చెప్పాను అని చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ, తాను, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande