విశాఖకు జగన్.. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న వైసీపీ అధినేత
విశాఖకు జగన్.. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న వైసీపీ అధినేత
jagan


విశాఖపట్నం, 13 జూలై (హి.స.)

వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నెల 14వ తేదీన జగన్ పర్యటన ఖరారైంది.

ఈ పర్యటన వివరాలను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆదివారం వెల్లడించారు. జూలై 14న ఉదయం 10:30 గంటలకు జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా దక్షిణ నియోజకవర్గంలోని జబ్బరుపేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చుతారని తెలిపారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కరి చిన్నాతో పాటు అతని కుటుంబ సభ్యులతోనూ జగన్ మాట్లాడతారని చెప్పారు.

ఈ సందర్భంగా కేకే రాజు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం జరిగినా, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరడానికి 20 గంటల సమయం పట్టిందని ఆరోపించారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసు, మత్స్య, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande