
పల్నాడు,:, 14 జూలై (హి.స.)
జిల్లాలోని వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి నక్క భారతి(28) తన ఇద్దరు కుమారులు హేమంత్ రెడ్డి(5), తేజ(3)ను హత్య చేసిన అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోగా, కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలిచివేశాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఘటన జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ