
అమరావతి, 14 జూలై (హి.స.)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతకు భంగం కలిగించే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శ్రామికుల హాజరు నమోదుకు ఉపయోగిస్తున్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో ఒకే ఫొటోను పలుమార్లు అప్లోడ్ చేసిన ఘటనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక విశ్లేషణలో 2026 మే 29 నుంచి జూన్ 10 వరకు నమోదైన హాజరులో ఒకే ఫొటోను వేర్వేరు తేదీల్లో లేదా వేర్వేరు మస్టర్ రోల్స్కు ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిని అత్యంత తీవ్రమైన అక్రమంగా పరిగణించిన కేంద్రం.. సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ