జల.జీవన్ మిషన్.పనులు రద్దు
జల.జీవన్ మిషన్.పనులు రద్దు
జల.జీవన్ మిషన్.పనులు రద్దు


అమరావతి, 14 జూలై (హి.స.)

ఈ ఏడాది మార్చిలో జల్జీవన్ మిషన్ పథకం ద్వారా సుమారు మూడు వేల నివాసిత ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి పనులు చేపట్టేందుకు ఇచ్చిన మంజూరు ఉత్తర్వులను రద్దు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 26న జీఓ నంబర్ 53, 54లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.1814.71 కోట్లతో 3 వేల పనులు, 7 మల్టీ విలేజ్ స్కీం ప్రాజెక్టులు రూ.9355 కోట్లతో మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ పనులను నాబార్డు, ఎన్ఐడీఏ, సాస్కి, పూర్వోదయ తదితర స్కీంల ద్వారా చేపడతామని పేర్కొంది. అయితే పరిపాలన సర్దుబాటు కోసం ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ 92 విడుదల చేసింది. ఈ పనులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande