వివక్ష లేకుండా కేంద్రం నిధులు: ఈటల
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
Eetela Rajendar


హైదరాబాద్, 14 జూలై (హి.స.)రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్లో ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర భాజపా ఆదేశాల మేరకు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈటల పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపడం లేదు. కేంద్రం నిధులిస్తున్నా.. భాజపా ఎంపీలు నిధులు తీసుకురావడం లేదంటూ విమర్శలు చేయొద్దు. రేషన్ కార్డులున్న అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చూడాలి. డెబ్బై ఏళ్ల పైబడిన వృద్ధులకు కేంద్రం అందిస్తున్న ‘వయ వందన’ ఆరోగ్య పథకం వారికి అందివ్వాలి. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఈటల అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande