
హైదరాబాద్, 14 జూలై (హి.స.)హైదరాబాద్ నగర పరిధిలో( ఓఆర్ఆర్ లోపల) నాలుగు చెరువుల అభివృద్ధికి తొలి దశ కింద రూ.227.98 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది. చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.74.35 కోట్లతో జీడిమెట్ల ఫాక్స్ సాగర్, రూ.68 కోట్లతో అమీన్పూర్ చెరువు, రూ.35 కోట్లతో అంబర్ చెరువు(భాగ్మీర్), రూ.50.63 కోట్లతో సరూర్నగర్ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.
మూడు దశల్లో ఈ నాలుగు చెరువుల పనులు చేపట్టనున్నారు. నాలుగు చెరువుల అభివృద్ధికి రూ.536 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో దశలో రూ.147.46 కోట్లు, మూడో దశలో సుందరీకరణ పనులకు రూ.161.06 కోట్లు వెచ్చించనున్నారు. ఈ పనులను హైడ్రా ద్వారా చేపట్టనున్నట్లు తెలిపింది. మరో ఉత్తర్వులో ప్రభుత్వం హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్