యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి
రాష్ట్రంలో యునాని వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
Damodar Rajanarsimha


హైదరాబాద్, 14 జూలై (హి.స.)రాష్ట్రంలో యునాని వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం సచివాలయంలో ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఆయుష్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ ఆసుపత్రులు రాష్ట్రంలోనే యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యమిస్తోందన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది పోస్టుల ఖాళీల భర్తీకి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande