
అమరావతి:, 14 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సవరించిన కొత్త షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు.కొత్త షెడ్యూల్ ప్రకారం, బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టే ఇంటింటి ఓటర్ల సర్వే గడువును జూలై 24, 2026 వరకు పొడిగించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.సవరించిన అధికారిక షెడ్యూల్ ఇలా ఉంది:
- ఇంటింటి ఓటర్ల సర్వే గడువు: జూలై 24, 2026 వరకు
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: జూలై 31, 2026
- క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు
- అభ్యంతరాల పరిష్కారం: జూలై 31 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు
- ఓటర్ల తుది జాబితా విడుదల: అక్టోబర్ 3, 2026
ఈ గడువు పొడిగింపు మరియు మార్పులకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం అదనపు సమయాన్ని కల్పిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi