స్వరాష్ట్ర సాధనలో మూడు జిల్లాల పాత్ర కీలకం
స్వరాష్ట్ర సాధనలో మూడు జిల్లాల పాత్ర కీలకం
Delegates


హైదరాబాద్, 14 జూలై (హి.స.)స్వరాష్ట్ర సాధనలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేర్కొంది. సచివాలయం సమీప అమరవీరుల స్మారక భవన సముదాయంలో ఈ మూడు జిల్లాల ఉద్యమకారులతో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు, సభ్యులు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్రెడ్డిలతో కూడిన బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జరిగిన ఆందోళనలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి క్షేత్రస్థాయి శ్రేణులే వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు శాశ్వతరక్షణ ఉండేలా, ఈ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. జైలుకు వెళ్లిన మహిళా ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులకు ఆర్టీసీ బస్సుల్లో జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, పింఛను, ప్రత్యేక హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో కొందరు సంబంధంలేని అంశాలను లేవనెత్తడం, దాన్ని కొందరు ఖండించడం, మరికొందరు సమర్ధించడంతో వారిమధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande