
హైదరాబాద్, 14 జూలై (హి.స.)కేసీఆర్ అవినీతి దాహానికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో కాళేశ్వరంపై ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసిన వెంకట్.. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు ఫొటోలను, కుంగిన చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఎలా చేశారో చూపించడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశా. ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి, తనకేం పట్టనట్టు ఫాంహౌస్లో నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎన్డీఎస్ఏ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను బయటపెట్టింది. వాస్తవాలు, అవాస్తవాలేంటో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించి, ప్రజలకు నిజాలు చెప్పాలి’’ అని బల్మూరి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్