
కడుప, 14 జూలై (హి.స.)కడుపలోని తెలుగు గంగ నీటిప్రాజెక్ట్ ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి యస్ ఈ . మల్లికార్జున మూర్తి ని కలసిన మైదుకూరు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న తెలుగు గంగ అనుబంధ కంచర్లపాలెం నీటి కుంట నుండి ఉబికి వస్తున్న నీటి బాధిత రైతులు, రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ బాధిత రైతుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
రైతుల, రైతు నాయకుల వినతికి స్పందించిన యస్ ఈ .మల్లికార్జునమూర్తి గారు సమస్య ఉన్న ప్రాంత తెలుగు గంగ డివిజన్ ఇంజనీర్ రామచంద్ర గారికి పొన్ ద్వారా సమస్యను తెలియజేసి బాధిత రైతులతో సమస్య ఉన్న తెలుగు అనుబంధ కంచర్లపాలెం కుంట ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను పూర్తిస్థాయిలో తెలియజేయాలని డి ఈ ని జిల్లా యస్ ఈమల్లికార్జున మూర్తి ని కోరడం జరిగిందనీఏవి.రమణ తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV