
తిరుచానూరు, 14 జూలై (హి.స.)విజయనగరానికి చెందిన భక్తుడు శ్రీనివాసన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 12.5 లక్షల విలువైన 56.800 గ్రాముల బంగారు వజ్రాల హారాన్ని బహుకరించారు.
విజయనగరం కు చెందిన శ్రీనివాసన్ సుమారు 56.800 గ్రాముల బంగారంతో తయారు చేసిన డైమండ్ హారాన్ని ఆలయాధికారులు అందజేశారు. దీని విలువ సుమారు 12 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
అంతకు ముందు అధికారులు డైమండ్ హారాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ డైమండ్ హారాన్ని శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయులు, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV