దైవదర్శానికి వచ్చి గుండెపోటుతో మృతి
దైవదర్శానికి వచ్చి గుండెపోటుతో మృతి
దైవదర్శానికి వచ్చి గుండెపోటుతో మృతి


నందిగామ, 19 జూలై (హి.స.)

: ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గోరేపల్లి గ్రామానికి చెందిన రావిపాటి పద్మావతి, కుటుంబసభ్యులతో కలిసి శనివారం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. రాత్రి వారు సత్రాల్లో బస చేశారు. ఉదయం లేచి చూసేసరికి పద్మావతి మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనుగంచిప్రోలు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande