రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం: కీలక అంశాలుప్రభుత్వ నియంత్రణలోనే సేవలు
రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం: కీలక అంశాలుప్రభుత్వ నియంత్రణలోనే సేవలు
chandra babu


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి చట్టబద్ధమైన అధికారాలు, ల్యాండ్ రికార్డులు, డేటా అంతా ముమ్మాటికీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (PSK) విధానం ఎంత విజయవంతమైందో, అదే తరహాలో రాష్ట్రంలో 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (RSK)' ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.: ప్రస్తుతం ప్రజలు రిజిస్ట్రేషన్‌కు ముందు దస్తావేజులు, పేపర్‌వర్క్ కోసం ప్రైవేట్ వ్యక్తులకు రూ.5,000 నుండి రూ.10,000 వరకు సమర్పించుకోవాల్సి వస్తోంది. కొత్తగా రాబోయే సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రీ-రిజిస్ట్రేషన్ సేవలు కేవలం గరిష్టంగా రూ.2,000 ఫెసిలిటేషన్ ఛార్జీతోనే పారదర్శకంగా అందుతాయి. ప్రైవేట్ భాగస్వాములు కేవలం అడ్మినిస్ట్రేటివ్ పేపర్‌వర్క్, సాంకేతిక నిర్వహణ, మౌలిక వసతుల సపోర్ట్ మాత్రమే చూసుకుంటారు. అసలైన డాక్యుమెంట్ల పరిశీలన, అర్హత నిర్ధారణ, డిజిటల్ సంతకం మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎప్పటిలాగే సబ్-రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు.: ఈ సరికొత్త సంస్కరణల ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు 'ఎనీవేర్ రిజిస్ట్రేషన్', అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, మరియు ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ వంటి వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande