తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
సిర్పూర్ (యు)లో 10.1 సెం.మీ. వర్షం
Rains


హైదరాబాద్, 21 జూలై (హి.స.)రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో నేటి ఉదయం వరకు కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 10.1 సెం.మీ. వర్షపాతం నమోదయింది. నల్గొండ జిల్లా కట్టంగూరు 8.2, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ 8.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande