
కోట, 21 జూలై (హి.స.)
: నెల్లూరు జిల్లా కోట మండలం పూనుగుంటపాలెంకు చెందిన గిరిజ (30) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ క్రమంలో భర్త శేఖర్ కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గిరిజా మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజా, శేఖర్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంగా భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మరణాంతర పరీక్షలో వాస్తవాలు తెలుస్తాయని ఎస్సై చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ