అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సస్పెండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సస్పెండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి  సస్పెండ్

పాడేరు, 21 జూలై (హి.స.)

: అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనధికారిక డిప్యుటేషన్లు, ఉద్యోగుల వేధింపులు, పరిపాలనా విధానాల ఉల్లంఘన, ఇతర అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande