23 నుంచి ‘ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్’
పాల్గొననున్న 36 జట్లు, 1,646 మంది క్రీడాకారులు.
Army


హైదరాబాద్, 21 జూలై (హి.స.)కేంద్ర భద్రతా దళాలు, వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకు నిర్వహించే 11వ ‘ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్-2026’ పోటీలు ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా) డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ హర్ప్రీత్ కౌర్ సోహి తెలిపారు. హకీంపేటలోని నిసాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె వివరాలను వెల్లడించారు. ఈ పోటీల్లో ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి 8 కేంద్ర సాయుధ బలగాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 28 రాష్ట్రాలకు చెందిన 36 జట్లు, మొత్తం 1,646 మంది క్రీడాకారులు, శిక్షకులు, సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెంచక్ సిలాట్ అనే 5 రకాల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణను నేర్పుతాయని, భావోద్వేగాలను పక్కనబెట్టి ఆట పైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్, విభాగాధిపతులు, నిసా కమాండెంట్్ అనిల్ కుమార్, ఏఐజీ చందర్ వీర్ సింగ్, సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande