గాదె.సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు ను మరింత ముమ్మరం చేసిన సిట్
గాదె.సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు ను మరింత ముమ్మరం చేసిన సిట్
sai


అమరావతి, 20 జూలై (హి.స.)

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అతడి తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను వారు రికార్డ్ చేశారు. ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలు ఏమిటనే అంశంపై ఆమెను వారు ఆరా తీశారు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే సీఐ నాగరాజు, కృష్ణ లంక పోలీసులపై విజయలక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను ఆమెను అడిగిన తెలుసుకున్నారు. ఈ కేసులో కృష్ణలంక పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ పోలీసుల ప్రమేయానికి సంబంధించిన అంశాలను విజయలక్ష్మి నుంచి సిట్ అధికారులు సేకరించారు. ఇక ఈ కేసులో తనకు తెలిసిన అన్ని వివరాలను ఈ సందర్భంగా సిట్ అధికారులకు విజయలక్ష్మి వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande