
ఆనందపురం , 20 జూలై (హి.స.)
: ఆనందపురం–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆనందపురం ఎస్సై పాపారావు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతదేహం నుజ్జునుజ్జయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ