
ఈపూరు: , 19 జూలై (హి.స.)
శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజినేయులు, మీరావలితోపాటు ఓ యువకుడు ఉన్నట్లు గుర్తించారు. దగ్గరి బంధువుల వివాహానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ