విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Nedumbassery Airport


విజయనగరం , 19 జూలై (హి.స.)

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టును ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేయనున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విమానాశ్రయాన్ని మంత్రి సందర్శించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యాధునిక ప్రమాణాలతో ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. అప్రోచ్ కనెక్టివిటీ రోడ్లు, మౌలిక సదుపాయాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు.

సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని, రూపురేఖలు పూర్తిగా మారిపోతాయిని మంత్రి వివరించారు. అనంతరం కలెక్టర్ ఎస్ .రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను ప్రారంభించామని, సుమారు 3000 వాహనాలు వస్తాయనే అంచనాతో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు, పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి కలెక్టర్, ఎస్పీతో చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande