వైసిపి నేత ఏపీ.అసెంబ్లీ మాజీ. స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై.భూ ఆక్రమణ కేసు
వైసిపి నేత ఏపీ.అసెంబ్లీ మాజీ. స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై.భూ ఆక్రమణ కేసు
land


శ్రీకాకుళం,, 19 జూలై (హి.స.)

:వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన కుటంబ సభ్యులపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేశారు. సీతారాం, ఆయన సతీమణి వాణితోపాటు వారి కుమారుడు చిరంజీవి నాగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చాపురంలోని సత్యసాయినగర్లో రూ. 4 కోట్ల విలువైన భూమిని సీతారాం కుటుంబం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుందంటూ జులై 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో గతంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించిన అరుణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి యజమాని గోవింరాజులు. అతడి పేరిట 900 గజాల స్థలం ఉంది.

ఆయన బతికి ఉండగానే.. మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి.. ఆమదాలవలసలో భూమిని తమ్మినేని సీతారాం కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ నేపథ్యంలో గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande