కార్వాన్లో బీజేపీ పూర్వ వైభవం సాధించాలి: మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్
కార్వాన్లో బీజేపీ పూర్వ వైభవం సాధించాలి: మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్
Mp


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో అబ్ కీ బార్

మోదీ సర్కార్ అనే బలమైన లక్ష్యంతో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా ముందుకు సాగాలని మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కార్వాన్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించిన విషయం తెలిసిందే. తాజాగా నిన్నటి ఈ సమావేశంపై ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో.. ఒకప్పుడు అమర్ సింగ్ నాయకత్వంలో గుడిమల్కాపూర్-కార్వాన్ ప్రాంతంలో బీజేపీ గొప్ప విజయాలు సాధించిందని గుర్తుచేసిన ఆయన.. దివంగత నేత బద్దం బాల్రెడ్డి హయాంలో కార్వాన్ నియోజకవర్గంలో ఉన్న పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఈటల స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మల్కాజ్గరి పార్లమెంట్ సభ్యుడిగా తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో నియోజకవర్గ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ వంటి సీనియర్ అగ్రనాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తన ట్వీట్ ద్వారా పార్టీ కార్యకర్తలకు ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande