రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లాయి
రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లాయని, విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు.
Bandi sanjay


హైదరాబాద్, 20 జూలై (హి.స.)రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లాయని, విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకుౌ ఆయన కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి రాజీవ్రంజన్సింగ్కు బహిరంగ లేఖ రాశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు.. తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ, గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజా ఆస్తుల నిర్వహణ వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ నిధులను నిర్దేశిత లక్ష్యాలకు భిన్నంగా ఖర్చు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. గ్రామాభివృద్ధి పనులకు వినియోగించకుండా సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, సాధారణ నిర్వహణ ఖర్చులు, ఇతర పరిపాలన అవసరాలకు మళ్లిస్తున్నట్లు గ్రామ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మౌఖిక ఆదేశాలతో గ్రామ సర్పంచులపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులను ఇతర ఖర్చులకు వినియోగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య పనులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది ఇప్పటివరకు విడతలవారీగా రూ.2,293.74 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్న క్రమంలో తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande