సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
Revanth reddy


హైదరాబాద్, 20 జూలై (హి.స.)ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం వార్నింగ్తో ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు. ఆగస్ట్ 3వ తేదీ వరకు నియోజకవర్గాలకు పరిమితం కావాలని దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు వెళ్లారు.

నిన్న సాయంత్రం నుంచి ‘సర్‘ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. 21 నియోజకవర్గాల్లో ‘సర్‘ పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాల్లో ‘సర్‘ కార్యక్రమాలు ప్రారంభించలేదని రిపోర్ట్లో వెల్లడైందని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీన మరోసారి ‘సర్‘పై రివ్యూ చేస్తామని తెలిపారు. ఆలోపు నేతలు పనితీరు మార్చుకోవాలని సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande