
కరీంనగర్, 20 జూలై (హి.స.)
ప్రజల ముంగిట మెరుగైన వైద్య సేవలు అందించుట కొరకే బస్తి దవఖానాలు నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో సోమవారం రోజున నూతన బస్తీ దవాఖాన నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పల్లె దవఖానాలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తూ మెరుగైన చికిత్సలు అందిస్తూ ముందుకు పోతున్నారని, అందులో భాగంగానే ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దవాఖానకు కావలసిన బోర్వెల్, ప్రహరీ నిర్మాణం తోపాటు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు మరో ఐదు లక్షల రూపాయలు మంజూరుకి కృషి చేస్తానని అన్నారు. మున్సిపల్ పరిధిలో సుగ్లంపల్లి, పూసాల, సుల్తానాబాద్ లలో మహిళా భవనాలకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు.
పట్టణంలోని మహిళలందరికీ 10 గుంటల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి నిధులు అందిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను సృష్టిస్తుందని గతంలో ప్రధానిగా ఉన్న నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ఎలాంటి కొరత లేకుండా యూరియాను అందించారని వివరించారు. ప్రస్తుతం ఎల్ - నోవా ప్రభావం ఉందని రైతులందరూ వరికి బదులుగా ఆరుతరి పంటలు వేసుకోవాలని, ప్రస్తుతం నీటిమట్టం ఉన్న మరో రెండు నెలల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. యూరియాకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడి దిగుబడులను పెంచుకునే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు