ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
IPS trainee


హైదరాబాద్, 20 జూలై (హి.స.)ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. దీంతో అత్తాపూర్ పోలీసులు కృష్ణారెడ్డిపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ అంశంపై ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ట్రైనీ ఐపీఎస్కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ ఘటన అనంతరం సొంతూరుకు వెళ్లిపోయిన కృష్ణారెడ్డి.. నిన్న సాయంత్రం మోతీనగర్లోని స్నేహితుడి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande