ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ
ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ
మంత్రి నారాయణ


నెల్లూరు,20 జూలై (హి.స.) : చదువుతో పేదరికాన్ని జయించవచ్చని ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. తాను ట్యూషన్స్ ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నెల్లూరు జిల్లాలో షైనింగ్ స్టార్ అవార్డ్స్ - 2026లో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.

ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు.

తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని మంత్రి నారాయణ ప్రస్తావించారు. తాను పదోతరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని వెల్లడించారు. పదోతరగతి ఫెయిల్ తనలో పట్టుదల పెంచిందని చెప్పుకొచ్చారు. డిగ్రీ మూడేళ్లల్లో యూనివర్శిటీ టాపర్గా నిలిచానని తెలిపారు. స్టాటిస్టిక్స్లో గోల్డ్మెడల్ సాధించానని వెల్లడించారు. వీఆర్సీలో పార్టు టైం లెక్చరర్గా రూ.40ల జీతానికి పనిచేశానని వివరించారు. మూడు నెలలకు గానూ రూ.120ల జీతం ఇస్తే తాను తీసుకోలేదని వెల్లడించారు. ప్రభుత్వ అధ్యాపకుడిగా అవకాశం ఇచ్చినా తాను రాజీనామా చేశానని ప్రస్తావించారు. యువనేత నారా లోకేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ఉద్ఘాటించారు. విద్యార్థులు ఈ మార్పులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande