రామవరంలో సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం
రామవరంలో సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం
రామవరంలో సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం


రామవ‌రం, 20 జూలై (హి.స.)

సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవ‌రంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సోమవారం సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు ఘనంగా పునఃప్రారంభించారు. అనంతరం వీకేసీఎం ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో డిస్పెన్సరీని ఆధునికీకరించి తిరిగి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ ఆధునికీకరణకు యాజమాన్యం నిరంతరం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డా.కిరణ్ రాజ్ మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో ఒక స్టాఫ్ నర్స్‌ను నిరంతరం అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన వైద్య సేవలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, రామవారంలో పునరుద్ధరించిన డిస్పెన్సరీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande