మేడ్చల్ రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ వినూత్న నిరసన
మేడ్చల్ రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ వినూత్న నిరసన
medchal


, 20 జూలై (హి.స.)

మేడ్చల్:

మేడ్చల్‌లో రోడ్ల పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ వినూత్నంగా నిరసన తెలిపింది. వరినాట్లు వేసి ఆందోళన వెల్లడించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏ వీధి చూసినా గుంతల పడి ధ్వంసమైన రోడ్లు, చినుకుపడితే కుంటలుగా మారుతాఉన్నియని ఆరోపించారు. నడవటం కూడా కష్టంగా ఉన్న ఈ వీధుల్లో వాహనదారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలిపారు. హౌజింగ్ బోర్డు కాలనీ, కేఎస్ఆర్ వెంచర్, కిందిబస్తీ, బాలాజీనగర్, ఉమానగర్‌లలో ఎక్కడా చూసినా ధ్వంసమైన రోడ్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాన్‌హోళ్లు తెరుచుకుని ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురికి నీళ్లు పొంగి పొర్లుతూ దుర్గంధం వెదలజల్లుతున్నాయని ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande