కడప కార్పొరేషన్లో మున్సిపల్ వర్కర్ల గేట్ మీటింగ్
కడప నగరంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
kadapa-municipal-workers-protest-demand-solutions-to-pending-issues-1652


కడప 20 జూలై (హి.స.)కడప నగరంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు)_ అనుబంధ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు సుంకర రవి కడప నగరంలోని 9, 10, 11, 25 డివిజన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో గేట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా గుంటగాని హరికృష్ణ మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిధిలోని కార్మికుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లు:

1. ఉద్యోగాల క్రమబద్ధీకరణ: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్, ఫిక్స్డ్ పే, ఆప్కాస్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి.

2. మృతుల కుటుంబాలకు న్యాయం: కడప కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు 3-4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. వెంటనే కరుణా నియామకాలు చేపట్టాలి.

3. కనీస వేతనం: అదనపు - Additional మరియు కోవిడ్ పారిశుద్ధ్య కార్మికులకు స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసిన ప్రకారం రూ.15,500 కనీస వేతనం చెల్లించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande