ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్
ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్
KTR


హైదరాబాద్, 20 జూలై (హి.స.)ఎలక్షన్స్‌ ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కేటీఆర్‌ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరీల్ శ్రీనివాస్ రావు, పలువురు నాయకులు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ. గతంలో బాన్సువాడలో గులాబీ జెండాను ఎగురవేశాం. పెద్దాయన పోచారంను గెలిపిస్తే పోయి పోయి మునిగిపోయే పడవ కాంగ్రెస్‌ పార్టీలో చేరిండని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి కుడిదిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నడుకక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు స్పీకర్‌గా చేసిన ఆ పెద్ద మనిషికి తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా చెప్పు్కోలేని పరిస్థితులో ఉన్నాడు. ఈ వయసులో ఇంత అవస్థ అవరమా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేయించుకొని ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని చెప్పారు. పోచారం దేవుని మీద ఒట్టేసి మాట తప్పిండు. రేవంత్‌ రెడ్డి ఒక్కడే దేవుడి మీద ఒట్టేసి మోసం చేస్తడు అనుకున్నాం. కానీ, పోచారం కూడా మోసం చేశాడన్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఓ చిచోరాగాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఖర్మగాలి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande