నదులు మన జీవనాధారం కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసు!
కర్నూలు నగరంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్య తనిఖీలు.
ఓబులేసు!


కర్నూలు, 20 జూలై (హి.స.)కర్నూలు నగరంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్య తనిఖీలు. తుంగభద్ర నది పరిరక్షణకు, కాలుష్య నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నదులు మన జీవనాధారమని, తాగునీరు, వ్యవసాయం, పర్యావరణ సమతుల్యతకు నదులు ఎంతో కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. నదుల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను వేయకుండా నదుల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు సోమవారం ఉదయం కమిషనర్ యస్. నాగప్ప స్ట్రీట్, సాయిబాబా నగర్, శంకర మఠం, నవాబ్ బంగ్లా, ఖండేరి, పూల బజార్, పప్పుల బజార్, గడియారం ఆసుపత్రి, వెంకటరమణ కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం నవాబ్ బంగ్లా సమీపంలోని తుంగభద్ర నదిని పరిశీలించి, నదీ తీరంలో ఉన్న అపరిశుభ్ర పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నదీ తీరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికే అప్పగించాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే హెల్ప్లైన్ నంబర్ 7422992299కు కాల్ చేయడం ద్వారా, వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లేదా పురమిత్ర యాప్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపారు. అంతేతప్ప ఎక్కడబడితే అక్కడ చెత్త వేయరాదని కమిషనర్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande