గత 5 నెలలుగా జీతాలు లేవు.. గుంతకల్లులో ఎంపీఈఓల నిరసన
గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయకపోవడంపై గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్కు ఎంపీఈవోలు వినతిపత్రం అందజేశారు.
గత 5 నెలలుగా జీతాలు లేవు.. గుంతకల్లులో ఎంపీఈఓల నిరసన


గుంతకల్లు, 20 జూలై (హి.స.)గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయకపోవడంపై గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్కు ఎంపీఈవోలు వినతిపత్రం అందజేశారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న: రెగ్యులర్ చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ఇస్తున్న అన్ని ప్రయోజనాలు తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ గుంతకల్లు ఎంపీహెచ్ఈవోలు సోమవారం RDO శ్రీనివాస్ గారికి వినతిపత్రం అందజేశారు. గుంతకల్లు RDO కార్యాలయంలో RDO శ్రీనివాస్ ను కలిసిన ఎంపీహెచ్ఈవోలు తమ సమస్యలను వివరించారు. గత 5 నెలలుగా జీతాలు అందడం లేదని, అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఏడాది కాంట్రాక్టు రెన్యూవల్ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఇంకా చేయలేదని తెలిపారు. వెంటనే రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సచివాలయాల్లో పనిచేస్తున్న VAA లకు ఇస్తున్నట్లుగా తమకు కూడా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు, భద్రత కల్పించాలని వినతిపత్రంలో కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎంపీహెచ్ఈవోలు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande