లైంగిక ఆరోపణలు.. ట్రైనీ IPS ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం (update)
లైంగిక ఆరోపణలు.. ట్రైనీ IPS ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
Ips


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి పై లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ కృష్ణారెడ్డి నిన్న మోతీనగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇవాళ ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బంధువులు అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ (Erragadda)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఉదయం సోషల్ మీడియా వేదికగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ఇన్స్టాగ్రామ్ (Instagram) స్టోరీ పోర్ట్చేశారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. నిజానిజాలు తెలుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Attapur Police Staton) లో ఉదయ కృష్ణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసులో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. జాతీయ పోలీసు అకాడమీలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం నేరుగా వారు ప్రకాశం జిల్లాలోని(Prakasam District) ఉదయ్ కృష్ణారెడ్డి స్వగ్రామానికి వెళ్లారు. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిపై కర్ణాటక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును జెట్ స్పీడ్లో చెపడుతున్నారు. ఈ మేరకు ఉదయ కృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు జాతీయ పోలీసు అకాడమీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తనను గదిలోకి పిలిచి, జుట్టు పట్టుకుని ఈడ్చి నోటికొచ్చినట్లుగా తిడుతూ.. తనపై ఉదయ కృష్ణారెడ్డి దాడికి చేశాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీసు అకాడమీలోని సీసీటీవీ ఫుటేజీలో క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా ఆధారాలతో విచారణ పూర్తి చేశారు. ట్రైనీ మహిళా ఐపీఎస్, ఉదయ కృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు అన్నీ నిజమని ప్రివిలేజ్ కమిటీ తేల్చింది. ఈ మేరకు ఉదయ కృష్ణారెడ్డి ఎన్పీఏ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande