మద్యం టెండర్ల గోల్మాల్ కేసులో నిందితులకు వచ్చే నెల 3 వరకు.రిమాండ్
మద్యం టెండర్ల గోల్మాల్ కేసులో నిందితులకు వచ్చే నెల 3 వరకు.రిమాండ్
liqueur


అమరావతి, 21 జూలై (హి.స.)

జగన్ హ యాంలో మద్యం రవాణా టెండర్లలో జరిగిన గోల్మాల్కు సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితులకూ విజయవాడ కోర్టు వచ్చే నెల 3 వరకు రి మాండ్ విధించింది. ఈ కేసులో అప్పటి రాష్ట్ర బేవరేజె స్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్(ఏ4), కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి(ఏ8)లను సిట్ అధికారులు పీటీ వారెంటుపై హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ముందుగా వారికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుల తరఫున న్యాయవాదులు అనిల్, బాలకృష్ణ, గౌతమ్ వాదనలు వినిపించారు. కేసులో నమోదు చేసిన సెక్షన్ 409 తప్ప మిగిలినవన్నీ ఏడేళ్లలోపు శిక్షపడేవేనని తెలిపారు. నిందితులను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిందన్నారు. వారిని ఈడీ అరెస్టు చేయడాని కి ముందు.. మద్యం రవాణా అక్రమాలపై నమోదైన కేసులోనే సిట్ అధికారులు నోటీసిచ్చి ప్రశ్నించారని.. ఇక ఈ కేసులో విచారణ చేయాల్సిన అవసరం లేదని, నిందితులకు 41ఏ నోటీసివ్వాలని కోర్టును కోరారు. కసిరెడ్డి, వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే చంచల్గూడ జైలుకు వారిని తరలించాలని అభ్యర్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande