విశాఖ గాజువాకలో.ముగ్గురు అన్నదమ్ములు.అదృశ్యం
విశాఖ గాజువాకలో.ముగ్గురు అన్నదమ్ములు.అదృశ్యం
missing


అమరావతి, 21 జూలై (హి.స.)

గాజువా క లో ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. చిన్నాన్న వద్ద ఉండి చదువుకుంటున్న వీరు ఎక్కడకి వెళ్లి ఉంటారో తెలియడం లేదు. దీనికి సంబంధించి గాజువాక సీఐ సీహెచ్ వాసునాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతగాజువాక కైలాస్నగర్కు చెందిన వి.రాఘవేంద్రరావు, అశ్వనీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు హర్షిత్(18) ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుండగా.. మిగిలిన ఇద్దరు రోహన్ (14) 9వ తరగతి, సాహిల్(11) 5వ తరగతి చదువుతున్నారు. భార్యభర్తల మధ్య గొడవల వల్ల రాఘవేంద్రరావు కొంతకాలం క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అశ్వనీ మహారాష్ట్రలోని షోలాపూర్లో పుట్టింటిలో ఉంటున్నారు. దీంతో రాఘవేంద్రరావు సోదరుడు సోమలింగ సోదరుడి పిల్లలను గాజువాకకు తీసుకువచ్చి చదివిస్తున్నారు. అయితే ఆదివారం ఈ ముగ్గురూ బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో వీరి దుస్తులు, ఆధార్కార్డులు, సర్టిఫికెట్లు కనిపించలేదు. వారి వద్ద ఉన్న చరవాణి కూడా ఇంట్లో వదిలేసి వెళ్లారు. అంతటా వెతికిన ఫలితం లేకపోవడంతో చిన్నాన్న సోమలింగ సోమవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల మావయ్య అక్షయ వచ్చి తీసుకెళ్లి ఉండచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మహారాష్ట్రలో ఉంటున్న అక్షయకు ఫోన్ చేస్తే తాను పిల్లలను తీసుకెళ్లలేదని, వచ్చి విచారణ జరుపుకోవచ్చని సమాచారం ఇవ్వడంతో మిస్టరీగా మారింది. గాజువాకలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎస్ఐ రమణతో కూడిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande