సోషల్ మీడియా.పోస్టుల.పై.నిఘా/ మంత్రి వంగల పూడి అనిత
సోషల్ మీడియా.పోస్టుల.పై.నిఘా/ మంత్రి వంగల పూడి అనిత
anitha


అమరావతి, 21 జూలై (హి.స.)

వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితవ్యాఖ్యానించారు. అయితే ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికల విస్తరణతో కొందరు వ్యక్తులు వాక్ స్వాతంత్య్రం పేరుతో అసత్య ప్రచారాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు ( మంగళవారం) ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీ ట్రీట్ టుడేస్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొని మాట్లాడారు.

రెండు రోజుల పాటు ఈ వర్క్షాప్ జరుగుతుందని.. రేపటి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని హోం మంత్రి అనిత తెలిపారు. మీ సలహాలు, సూచనలు సీఎంకు ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వివిధ విభాగాలు అన్ని ఒకేచోట చేర్చామని వెల్లడించారు. ఈరోజు జరుగుతున్న రీట్రీట్ ఫ్యూచర్ రెడీ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. మహిళల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. గంజాయిని అరికట్టడం కోసం ఈగల్ ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చామని ప్రస్తావించారు

పోలీసుల సహకారంతో గంజాయి సాగును అరికట్టామని హోం మంత్రి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకులని చెప్పుకొచ్చారు. 2028 నాటికి 50ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరేం చెప్పిన చంద్రబాబు వింటారని అన్నారు. 50ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఎంతోమంది పోలీస్ అధికారులతో పని చేశారని ప్రస్తావించారు. సైబర్ క్రైమ్స్ను అరికట్టిల్సిన అవసరం ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీఎం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande