
అమరావతి, 21 జూలై (హి.స.)
ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు అవసరమైన ఎలకా్ట్రనిక్ సర్వీస్ రిజిస్టర్ 2.0(ఈ-ఎస్ఆర్) అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సేవా రికార్డుల డిజిటలైజేషన్, నిర్వహణ కోసం ఈ-ఎ్సఆర్ 2.0 యాప్ మెరుగ్గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీనిలో ఉద్యోగుల ప్రాథమిక, వ్యక్తిగత వివరాలు, సర్వీస్ ఈవెంట్స్, ప్రోత్సాహకాలు, రుణాలు, అడ్వాన్సులు, లీవ్ లెడ్జర్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వివరాలు, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ వివరాలు ఉంటాయి. ఈ యాప్లో ప్రభుత్వ ఉద్యోగి ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ను స్కాన్ చేసి, అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి సర్వీస్ ఈవెంట్ను ఎంట్రీ చేయాలి. యాప్లో ఉన్న చెకర్ సాయంతో ఈ వివరాలను స్కాన్ చేసిన కాపీతో సరిచూసి తుది ఆమోదం కోసం హెచ్ఆర్ మేనేజర్కు పంపుతారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ మాడ్యూల్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తారు. అప్పటి నుంచి వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు, సెలవులు, సస్పెన్షన్లు లాంటి అన్ని సర్వీస్ ఈవెంట్లను ఈ-ఎస్ఆర్లోనే నమోదు చేయాలి.
ఇంటి అద్దె భత్యం గడువు పొడిగింపు
రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం లేదా రూ.25,000 గరిష్ఠ పరిమితితో ఇంటి అద్దె భత్యం సౌకర్యాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సీఆర్డీఏ క్వార్టర్స్ సౌకర్యం కల్పించే వరకు లేదా 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చేవరకు లేదా జూన్, 2027 వీటిలో ఏది ముందైతే అది అప్పటివరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని జీవోలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ