కరవును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం
భారాసలో చేరికల కార్యక్రమంలో కేటీఆర్
BRS


హైదరాబాద్, 21 జూలై (హి.స.)రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎల్నినోపై శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన భారాస పార్టీలో చేరికల కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతింటే.. వాటికి మరమ్మతు చేయకుండా మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదు. బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లందించే అవకాశమున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని సముద్రంలోకి వదులుతోంది. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande